‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 14వ రోజు షెడ్యూల్‌ | Memantha Siddham: CM Jagan Bus Yatra April 13th Schedule | Sakshi
Sakshi News home page

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 14వ రోజు షెడ్యూల్‌

Apr 12 2024 9:23 PM | Updated on Apr 13 2024 10:29 AM

Memantha Siddham: Cm Jagan Bus Yatra April 13th Schedule - Sakshi

గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అటు ఎండను, ఇటు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సీఎం జగన్‌ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు(శుక్రవారం) ధూళిపాళ్ల నుంచి బయల్దేరి ఏటుకూరు వరకూ దిగ్విజయంగా కొనసాగింది.  ఒకవైపు భారీ వర్షం పడినా సీఎం జగన్‌ బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలిపారు.

మేమంతా సిద్ధం’ 14వ రోజు శనివారం(ఏప్రిల్ 13) షెడ్యూల్‌
ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ రేపటి(శనివారం)బస్సుయాత్రను నంబూరు బైపాస్‌(రాత్రి బస చేసిన చోటు) నుంచి ప్రారంభిస్తారు. కాజా, మంగళగిరి బైపాస్ మీదగా 11గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.  అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో  రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈ మేరకు 14వ రోజు బస్సుయాత్ర షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement