Andhra Pradesh: భారీగా ఐఏఎస్‌ల బదిలీ | Massive transfer of IAS Officers In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Jun 20 2024 2:41 AM | Updated on Jun 20 2024 7:34 AM

ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్‌

ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్‌

ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న

సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌

శ్రీలక్ష్మి, రజత్‌ భార్గవ, ప్రవీణ్‌ ప్రకాశ్‌ జీఏడీకి అటాచ్‌

మురళీధర్‌రెడ్డి కూడా..

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికా­రు­లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్, ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ వీసీ–ఎండీ డి.మురళీధర్‌రెడ్డిలను తదు­పరి పోస్టింగ్‌ కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు. 

జలవన­రుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్ర­సాద్, పంచాయతీరాజ్, గ్రామీ­ణా­భి­వృద్ధి ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌ కుమార్, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ నియ­మితులయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ను బదిలీ చేసి గనులు, భూగర్భ వనరుల శాఖ కమిషనర్, డైరెక్టర్‌గా నియమించారు. తిరుపతి జాయింట్‌ కలెక్టర్‌కు ఆ జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్‌గా బి.రాజశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement