విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీగా కార్మికుల తొలగింపు | Massive Layoffs At Visakhapatnam Steel Plant | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీగా కార్మికుల తొలగింపు

Mar 8 2025 7:40 PM | Updated on Mar 8 2025 8:01 PM

Massive Layoffs At Visakhapatnam Steel Plant

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులను భారీగా తొలగించారు. 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది.

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులను భారీగా తొలగించారు. 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఏ క్షణమైనా సమ్మెకు కాంట్రాక్ట్ కార్మికులు దిగనున్నారు. రేపు భారీ ఆందోళనకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె నోటీసు గడువు ముగిసింది. స్థానిక ప్రజా ప్రతినిధులపై కార్మికులు మండిపడుతున్నారు.

కాగా, స్టీల్‌ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌కు ఇచ్చిన షోకాజ్‌ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని జిల్లా అధ్యక్షుడు ఎన్‌.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. అయోధ్యరామ్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు పరిపాలన భవనం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోరాటంలో అనైక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా.. స్టీల్‌ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతారన్నారు. గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా స్టీల్‌ పరిశ్రమలో సమస్యలు పరిష్కారం కావని ఆయన వివరించారు. సస్పెన్షన్లు, షోకాజ్‌ నోటీసులతో కార్మి ఉద్యమాన్ని అణచలేరన్నారు. వెంటనే యాజమాన్యం నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement