సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అధికార టీడీపీ నాయకుడికి చెందిన గోడౌన్‌లో టన్నుల కొద్దీ గోమాంసం లభ్యమైంది. ఇంత పెద్ద మొత్తంలో గో మాంసం పట్టుబడటంతో ధార్మిక సంఘాలు.. కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నాయి.
వివరాల ప్రకారం.. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తా కోల్డ్ స్టోరేజ్‌లో పెద్ద మొత్తంలో గోమాంసం పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు సోమవారం ఉదయం గోమాంసం వ్యవహారాన్ని గుట్టు రట్టు చేశారు. అయితే, గోడౌన్‌లో లక్షా 89వేల కేజీల గోమాంసం పట్టుబడితే అసలు సూత్రధారులను మాత్రం పోలీసులు పట్టుకోకపోవడం గమనార్హం. అధికార టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసులు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. టన్నుల కొద్దీ గోమాంసం ఉండటంతో స్థానికులు షాకవుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని నెటిజన్లు నిలదీస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను సైతం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.



