మంత్రి గుమ్మడి సంధ్యా రాణికి చేదు అనుభవం | Manyam Villagers Questioned By Gummadi Sandhya Rani | Sakshi
Sakshi News home page

మంత్రి గుమ్మడి సంధ్యా రాణికి చేదు అనుభవం

Apr 3 2025 10:51 AM | Updated on Apr 3 2025 1:47 PM

Manyam Villagers Questioned By Gummadi Sandhya Rani

సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో మంత్రి గుమ్మడి సంధ్యా రాణికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ప్రజా సమస్యలపై పలువురు మహిళలు.. మంత్రిని ప్రశ్నించడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ప్రశ్నించిన మహిళలకే సదరు మంత్రి క్లాస్‌ ఇవ్వడం గమనార్హం.

మంత్రి గుమ్మడి సంధ్యా రాణి తాజాగా మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం గొలుగువలసలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు మహిళలు.. తమకు తాగు నీరు ఇవ్వడం లేదని మంత్రిని చుట్టుముట్టి ప్రశ్నించారు. ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తమ గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో, మంత్రి సంధ్యా రాణి అసహనం వ్యక్తం చేశారు. తాగు నీటి విషయంలో గ్రామ కార్యదర్శి పట్టించుకోకపోతే తనను ఏం చేయమంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తాగునీటి సమస్యపై స్పందించకుండా తనని అడ్డుకున్నందుకు మహిళలకు క్లాస్ ఇచ్చారు సంధ్యారాణి. ఈ క్రమంలో మహిళలు ఖంగుతున్నారు. తమ సమస్యలు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement