Mana Badi Nadu-Nedu :Student Speeches At East Godavari- Sakshi
Sakshi News home page

జగన్‌ మామయ్యకు చాలా చాలా థాంక్స్‌

Published Mon, Aug 16 2021 1:34 PM

Mana Badi Nadu Nedu School students Speeches In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ‘‘మల్లె వంటి మనసు కలిగిన జగన్‌ మామయ్యకు నా హృదయ పూర్వక నమస్కారాలు. నేను చదివే పాఠశాలలోనే మా నాన్న గారు హెచ్‌ఎమ్‌గా పని చేస్తున్నారు. ప్రతి రోజు నాన్నతోనే పాఠశాలకు వెళతాను. సెకండ్‌ క్లాస్‌ చదివేటప్పుడు 20 మంది స్నేహితులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 88 మంది స్నేహితులయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మన చదువుల కోసం జగన్‌ మామయ్య చేస్తున్న సేవలను మనం తప్పక తెలుసుకోవాలి. పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తున్నారు.

గతంలో బడికి పోయే టప్పుడు అమ్మ లంచ్‌ బాక్స్‌ పెట్టేది. అదే స్కూళ్లో తినేదాన్ని. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బడి పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ‘‘ జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంలో భాగంగా రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఆ భోజనం తినటం వల్ల మేము చాలా యాక్టివ్‌గా ఉంటున్నాము. రోజుకో వెరైటీ ఫుడ్‌ తింటున్నాము. ఇలాంటి ఫుడ్‌ అందిస్తున్న జగన్‌ మామయ్యకు చాలా చాలా థాంక్స్‌!’’ అని విద్యార్థిని ప్రణవి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. తమకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేసింది. 

కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో  'జగనన్న విద్యాకానుక'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం పి. గన్నవరం జెడ్పీహెచ్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొగలికుదురు గ్రామానికి చెందిన 5వ తరగతి ప్రణవి ఇలా తన అనుభవాన్ని పంచుకుంది.

Advertisement
Advertisement