ఏపీకి తుపాన్‌ ముప్పు తప్పినట్టేనా..?

Low Pressure Formed In Bay Of Bengal Has Turned Into Cyclone - Sakshi

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపు(ఆదివారం) ఉదయానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద తెలిపారు. ఎల్లుండి తీవ్ర అల్పపీడనం.. తుపాన్‌గా మారనుంది. 25న బంగ్లాదేశ్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
చదవండి: విషాద జీవితాల అనాథ బిడ్డలకు ‘అమ్మఒడి’ ఆలంబన

తుఫాన్‌ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రం లోపలికి వేటకు వెళ్ళరాదని, శనివారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న రెండు రోజులపాటు వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావారణ కేంద్రం వెల్లడించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top