
వీరయ్యచౌదరి కుటుంబాన్ని పరామర్శించేందుకు అమ్మనబ్రోలు వచ్చిన మంత్రి
హత్య కేసు విచారణ తీరుపై వీరయ్యచౌదరి కుటుంబం అసంతృప్తి
అసలు నిందితులను వదిలేసి కేసును నీరుగారుస్తున్నారని టీడీపీ కార్యకర్తల నినాదాలు
వీరయ్యచౌదరి హత్య కేసుపై మాట్లాడాలని పట్టుబట్టిన గ్రామస్తులు
మంత్రి కారును అడ్డుకునేందుకు యత్నం
మాట్లాడకుండా వెళ్లిపోయిన లోకేశ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ నాయకుల చేతిలో దారుణ హత్యకు గురైన అదే పార్టీ నాయకుడు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచి్చన మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చుక్కలు చూపించారు.
వీరయ్యచౌదరిని అంతమొందించిన అసలు నిందితుల్ని వదిలేసి కేసును నీరుగారుస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ తీవ్ర నిరసన తెలిపారు. హత్య కేసు విచారణ తీరుపై వీరయ్యచౌదరి కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఈ కేసుపై మాట్లాడాలని గ్రామస్తులు పట్టుబట్టారు. మంత్రి లోకేశ్ ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు యత్నించాయి.
వీరయ్యచౌదరి కుటుంబ అసంతృప్తితో లోకేశ్‌కు భంగపాటు
గత నెల 22న ఒంగోలులో వీరయ్యచౌదరి హత్య జరిగితే 24 రోజుల తర్వాత మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంత్రి లోకేశ్ గురువారం అమ్మనబ్రోలు వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలతో కలిసి వీరయ్య భార్య సుచిత్ర, కుటుంబ సభ్యులతో లోకేశ్ మాట్లాడారు.
అయితే, వీరయ్య హత్య కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని ఆయన భార్య సుచిత్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అసలు నిందితులపై కేసు తీవ్రత తగ్గించారని మంత్రి లోకేశ్‌కు చెప్పినట్టు సమాచారం. దీంతో ఏం చెప్పాలో తెలియక మంత్రులు, ఎమ్మెల్యేలతో లోకేశ్ గుసగుసలాడినట్లు తెలిసింది. వీరయ్య కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలతో భంగపాటుకు గురైన లోకేశ్ సీరియస్‌గా బయటకు వచ్చేశారు.
పార్టీ శ్రేణుల నుంచీ నిరసన
వీరయ్యచౌదరి కుటుంబ సభ్యుల పరామర్శ తర్వాత మంత్రి లోకేశ్ పార్టీ శ్రేణులతో మాట్లాడతారని చెప్పడంతో వీరయ్య వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేచి చూశారు. అయితే ఎవరితోనూ మాట్లాడకుండానే లోకేశ్ కారు ఎకేŠాక్శరు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు లోకేశ్ కారుకు అడ్డుపడేందుకు యత్నించారు.
నినాదాలు చేశారు. ఫలితంగా పోలీసుల సహకారంతో లోకేశ్ అక్కడి నుంచి జారుకున్నారు. దీనిపై గ్రామస్తులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణపై అనేక అనుమానాలు ఉన్నాయని గ్రామ టీడీపీ నాయకుడు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.