
గుంటూరు: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో శాఖలు ఏర్పాటు చేసిన ఫ్యాషన్ స్టోర్ లైఫ్‌స్టైల్ ఆంధ్రప్రదేశ్‌లో మరింత విస్తరించనుంది. ఈ విషయాన్ని లైఫ్ స్టైల్ సీఈఓ దేవరాజన్ అయ్యర్ తెలిపారు. తాజాగా గుంటూరులో లక్ష్మీ పురం రోడ్‌లోని ఎన్టీఆర్ స్టేడియం పక్కన తన మొదటి స్టోర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా టైర్–2 మార్కెట్‌లలో విస్తరణ దిశగా తమ తొలిఅడుగు వేశామని ఈ స్టోర్ 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశామన్నారు. స్థానికంగా వినియోగదారులకు ఫ్యాషన్‌పై సమగ్ర అవగాహన ఉందని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ స్టోర్ సేవలు అందిస్తుందన్నారు. దశలవారీగా పలు పట్టణాలలో లైఫ్ స్టైల్‌ను అందుబాటులోకి తేనున్నామని వెల్లడించారు.