Covid-19: స్వల్ప లక్షణాలుంటే ఇల్లే మేలు 

Lancet Journal: Most Of Covid Patients Recovered Home Isolation 1st Wave - Sakshi

కోవిడ్‌ తొలి దశలో ఇంట్లో వైద్యం పొందినవారికి రెండో దశలో సమస్యలు తక్కువే 

ఆస్పత్రులకు వెళ్లినవారిలోనే మైగ్రేన్, శ్వాస సమస్యలు 

లాన్సెట్‌ జర్నల్‌ అధ్యయనం 

సాక్షి, అమరావతి: తొలి దశ కోవిడ్‌ సమయంలో ఇంటి వద్దే వైద్యం పొందిన వారిలో రెండో దశ కోవిడ్‌ ప్రభావం అంతగా కనిపించడం లేదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లక తప్పని వారిలోనే రెండో దశ కోవిడ్‌ అనేక సమస్యలకు కారణమవుతోంది. అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌.. లాన్సెట్‌ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గతేడాది మొదటి దశ కోవిడ్‌ సమయంలో స్వల్ప లక్షణాలున్నవారిలో ఎక్కువ మంది ఆస్పత్రి బాట పట్టలేదు. ఇంటి వద్దే 14 రోజులు ఉండి.. వైద్యులు సూచించిన మందులు వాడి కోలుకున్నారు.

భారత్‌లాంటి దేశాల్లో ఇలా కోలుకున్నవారి రేటు ఎక్కువగానే ఉంది. అయితే.. కొంతమంది పరిస్థితి ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రులకు వెళ్లారు. అప్పుడప్పుడే కరోనాకు వైద్యం అందుబాటులోకి వస్తున్న సమయంలో తెలియకుండానే ఆస్పత్రులు ఇచ్చిన మందులు వాడాల్సి వచ్చింది. ఇవి ఆ తర్వాత యాంటీబాడీస్‌పై కొంత ప్రతికూల ప్రభావం చూపాయని లాన్సెట్‌ అధ్యయనం స్పష్టం చేసింది.   

రెండో దశలో ప్రభావం 
అధ్యయనంలో భాగంగా మన దేశంలో తాజాగా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన 8,983 మందిని, నెగిటివ్‌ వచ్చిన 80,893 మందిని పరిశీలించారు. వారందించిన వివరాలను బట్టి.. తొలి దశ కోవిడ్‌లో ఇంటి వద్ద చికిత్స పొంది.. రెండో దశలో కోవిడ్‌ బారిన పడిన వారిలో 91 శాతం మందికి నెగిటివ్‌ వచ్చాక పెద్దగా సమస్యలు లేవు. అయితే.. వీరిలో కొంతమంది రెండో దశలో వైద్య సేవలకు ఆస్పత్రులకు వెళ్లారు.

వీరికి భవిష్యత్‌లో ఎలా ఉంటుందనేది అధ్యయనం చేయాల్సి ఉంది. ఇక మొదటి దశలో ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న ఎక్కువ మంది రెండో దశలో కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చినా ఎక్కువగా మైగ్రేన్, శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. స్వల్ప లక్షణాలుండి.. ఇంటి వద్దే మందులతో తగ్గే అవకాశం ఉంటే.. దానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని తాజా వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.   

చదవండి: Andhra Pradesh: జూలై 15 నాటికి కరోనా తగ్గుముఖం!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-05-2021
May 18, 2021, 14:32 IST
సుమారు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఉత్తమ మేకప్‌ మ్యాన్‌గా నంది అవార్డును సైతం అందుకున్నాడు..
18-05-2021
May 18, 2021, 13:55 IST
ఢిల్లీ: కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో కరోనా మహమ్మారికి బలవుతూ వస్తున్నారు....
18-05-2021
May 18, 2021, 13:05 IST
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏం మాట్లాడాలి అనుకున్నా కరోనాతోనే మొదలవుతుంది. దానితోనే ముగుస్తుంది. కరోనా చాలామంది జీవితాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. మనుషులు...
18-05-2021
May 18, 2021, 12:09 IST
సాక్షి, అమరావతి: కరోనా విజృంభణ నేపథ్యంలో  రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (డీమ్డ్‌ వర్సిటీ) ప్రొఫెసర్లు, విద్యార్థులు ఊరటనిచ్చే...
18-05-2021
May 18, 2021, 11:33 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్‌ పోర్టల్‌ ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ యాప్‌ వచ్చే వారం...
18-05-2021
May 18, 2021, 10:45 IST
మనం వాడే టూత్‌ బ్రష్‌లు కోవిడ్‌ వాహకాలుగా మారుతున్నాయా? కోవిడ్‌ బారినపడిన వారు వినియోగించిన బ్రష్‌లను కోలుకున్నాక కూడా వాడితే...
18-05-2021
May 18, 2021, 09:40 IST
‘‘అమ్మా.. నువ్వేదో దాస్తున్నాం. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్‌’’
18-05-2021
May 18, 2021, 09:27 IST
కోవిడ్‌ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది.
18-05-2021
May 18, 2021, 09:03 IST
బనశంకరి: కర్ణాటకలో బెళగావి జిల్లాలో కోవిడ్‌–19 మహమ్మారి వల్ల ఆదివారం వరకు 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృత్యవాతపడ్డారు. జిల్లాలో...
18-05-2021
May 18, 2021, 08:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి తీవ్రరూపం దాలుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దేశంలో కరోనా...
18-05-2021
May 18, 2021, 08:34 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19తో కన్నవారిని వారిని పోగొట్టుకున్న చిన్నారుల పునరావాసం విధానాన్ని కేంద్రం ఖరారు చేసింది. కోవిడ్‌ మహమ్మారికి బలైపోయిన తల్లిదండ్రుల...
18-05-2021
May 18, 2021, 08:08 IST
కరోనా కోరల్లో కోలివుడ్‌ విలవిలలాడుతోంది. దర్శకుడు అరుణ్‌రాజ్‌ కామరాజ్‌కు భార్య హింధూజ, యువ నటుడు నితీష్‌ వీరా కరోనాతో కన్నుమూశారు..
18-05-2021
May 18, 2021, 04:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వేగం కాస్త నెమ్మదించినట్లుగా కనిపిస్తోంది. గత వారంలో మే 10 నుంచి...
18-05-2021
May 18, 2021, 04:48 IST
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వర్తించే...
18-05-2021
May 18, 2021, 04:34 IST
సాక్షి, అమరావతి: గ్రామ పొలిమేరల్లోకి కూడా కరోనా రాకుండా సర్పంచుల నేతృత్వంలో పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని, కొత్తగా ఎన్నికైన...
18-05-2021
May 18, 2021, 04:29 IST
బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌) వ్యాధికి గురవుతున్న వారి చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, అందుకయ్యే ఖర్చును మొత్తం...
18-05-2021
May 18, 2021, 04:24 IST
మలక్‌పేట(హైదరాబాద్‌): ... అయినా ప్రైవేట్‌ ఆస్పత్రుల తీరు మారలేదు. అదే ధోరణి.. కాసుల కోసం అదే కక్కుర్తి.. బకాయి బిల్లు...
18-05-2021
May 18, 2021, 04:15 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఏడాది వ్యాక్సిన్ల కోసం మన దేశం అక్షరాలా రూ.75...
18-05-2021
May 18, 2021, 03:37 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా చేస్తున్న సీటీ స్కాన్, ఇతర పరీక్షలకు, పీపీఈ కిట్స్‌కు...
18-05-2021
May 18, 2021, 02:54 IST
బంజారాహిల్స్‌: రష్యా తయారీ స్పుత్నిక్‌–వి టీకాల కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో తొలిడోసును డాక్టర్‌ రెడ్డీస్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top