
సాక్షి, చిత్తూరు: కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. వినాయక స్వామి వారి అభిషేకానికి పాడైపోయిన(విరిగిపోయిన) పాలను ఉపయోగించుకున్నారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
వివరాల ప్రకారం.. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రతీరోజు ఉదయం, సాయంత్రం క్షీరాభిషేకం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. అయితే, బుధవారం సాయంత్రం స్వామి వారికి అభిషేకం చేయడానికి విగిరిపోయిన, నాసిరకం పాలను ఉపయోగించారు. కాంట్రాక్టర్ ఇలా విరిగిపోయిన పాలను సరఫరాల చేయడంతో స్వామి వారికి ఇలానే అభిషేకం కానిచ్చేశారు. ఇది చూసిన భక్తులు.. అపచారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, నాసిరకం పాలను సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.