కందుకూరు తొక్కిసలాట ఘటనపై విచారణ

Justice Seshasayana Reddy commission investigation Kandukuru Stampede Incident - Sakshi

నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనను జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిషన్‌ విచారణ చేపట్టింది. ఈ విచారణకు తాడికొడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌ హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ..సమావేశానికి పర్మిషన్ తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించినట్లు తెలిపారు. సభ ప్రాంగణం అనుమతి గురించి చర్చ జరిగిందన్నారు. అనుమతి తీసుకున్న డాక్యుమెట్స్ అడిగారని, సభకు అనుమతి తీసుకున్న పత్రాలు కమిషన్‌కు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 15 వ తేదీన 3 గంటలకు మళ్లీ విచారణకు రమన్నారని తెలిపారు.

కాగా ఇప్పటికే గుంటూరు తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్‌ విచారించిన సంగతి తెలిసిందే. కందుకూరు విచారణ అనంతరం ప్రభుత్వానికి కమిషన్‌ నివేదకి అందజేయనుంది. కందుకూరులో చంద్రబాబు నాయుడు గత డిసెంబర్‌లో నిర్వహించిన రోడ్‌ షో పెను విషాదాన్ని మిగిల్చింది. రోడ్‌ షో జరిగిన ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top