ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు..

Jaradukalani Villagers Strange Tradition In Srikakulam District - Sakshi

సీతంపేట(శ్రీకాకుళం జిల్లా): గ్రామాన్ని చల్లగా చూడాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సీతంపేట మండలం జరడుకాలనీ గ్రామస్తులు గ్రామదేవత పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు గ్రామంలోకి ఇతరులు రాకను నిషేధించారు.

చదవండి: సీఎం జగన్‌ ఆదేశాలు: పెద్దమ్మా.. ఇదిగో సెల్‌ఫోన్‌!

మొదటి రోజున గ్రామ శివారున సందమ్మ, రెండో రోజున అమ్మవారికి, మూడో రోజున గ్రామ పితృదేవతలకు మొక్కులు తీర్చారు. దీనిలో భాగంగా బుధవారం యజ్జరోడు, దీసరోడు, జన్నోడులు వారి భాషలో ప్రత్యేక మంత్రాలు చదువుతూ పూజలు చేశారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ పూజలు చేస్తున్నామని, అందరూ సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top