ఎనీ డౌట్‌? కలామ్‌ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ | It Is Just An Illusion That Chandrababu Suggested The Name Of Kalam | Sakshi
Sakshi News home page

ఎనీ డౌట్‌? కలామ్‌ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ

Jun 26 2022 10:44 AM | Updated on Jun 26 2022 2:20 PM

It Is Just An Illusion That Chandrababu Suggested The Name Of Kalam - Sakshi

తమ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండటంతో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్మూ ఎంపికను వైఎస్సార్‌సీపీ స్వాగతించింది. మద్దతు ప్రకటించింది. రాష్ట్రం కోసం బేరాలాడకుండానే ముర్మూకు మద్దతు తెలపడమేమిటని ఎల్లో గ్యాంగ్‌ ఒక వాదాన్ని లేవ దీసింది. బేరాల ముసుగేసుకొని బీరాలుపోతున్న ఈ ప్రగతి నిరోధకుల నిజస్వరూపాన్ని ప్రజలు గమనించకుండా ఉండరు.

సరిగ్గా కేంద్రంలో ఇవే పరిస్థితులు ఉండి, జగన్‌ గారి స్థానంలో బాబుగారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ముర్మూ ఎంపిక తర్వాత ఎల్లో మీడియా కథనాలు ఎలా ఉండేవి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని ఒక ప్రకటన విడుదల చేస్తే లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు వస్తాయి. అందులో కనీసం 90 శాతం మంది సరైన సమాధానమే రాస్తారు. ఎందుకంటే ఎల్లో మీడియా ఎప్పుడే కథనాన్ని ఎలా రాస్తుందో ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. ‘మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీకి చంద్రబాబు ఈ సలహా ఇచ్చారు. ద్రౌపది ముర్మూను ఎంపిక చేయాలని గట్టిగా చెప్పారు.అందుకు ప్రధాని అంగీకరించారు. 

వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేత ముస్లిం మైనారిటీకి చెందిన అబ్దుల్‌ కలామ్‌ను బాబే నిలబెట్టించారు. ఇప్పుడు గిరిజన మహిళను సూచించి బాబు మరో ఘనకార్యం చేశారు’ అని రాసి ఉండేవారు. ఎనీ డౌట్‌? ఎల్లో మీడియా ప్రచారం వల్ల నిజంగానే కలామ్‌ను బాబే సూచించారని చాలామంది భ్రమపడ్డారు. ములాయంసింగ్‌ యాదవ్‌ చేసిన సూచనకు అంగీకరించి వాజ్‌పేయి కలామ్‌ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారని చాలాకాలం తర్వాత గానీ బయటకు రాలేదు.

పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement