ప్రేమించి పెళ్లాడి.. వదిలేశాడు

Husband Cheating On Wife At Chittoor - Sakshi

చిత్తూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కడుపు వస్తే మాయ మాటలతో కడుపు తీయించి గాలికి వదిలేశాడంటూ బాధితురాలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఎస్‌ఐ దస్తగిరి మాట్లాడుతూ కడప జిల్లా పులివెందులకు చెందిన శిరీష, చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఈదువారిపల్లెకు చెందిన నిరంజన్‌కుమార్‌ విజయవాడలో 2018 నుంచి 2022 వరకూ ఒకే కళాశాలలో బీటెక్‌ చదువుకున్నారు. కళాశాలలో చేరినప్పటి నుంచి వెంటపడి ప్రేమించి, మొదటి సంవత్సరం ఆఖరిలో విజయవాడలోనే కనక దుర్గమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. 

అప్పటి నుంచి కలిసే ఉంటున్నారు. 2021లోర్భం దాల్చన విషయాన్ని గుర్తించిన నిరంజన్‌కుమార్‌ తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయాన్ని, తాను గర్భంగా ఉన్న విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నన్ను ఇష్టపడ లేదు. దీంతో నిరంజన్‌కుమార్‌ మా తల్లిదండ్రులకు నచ్చలేదు. వేరే పెళ్లి చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వారి తల్లిదండ్రులను నిలదీస్తే, నాలుగేళ్లు ఆగు చూద్దామని చెప్పి చేతులు దులుపుకున్నారు. 

ఈ విషయమై కడపలో కూడా నిరంజన్‌కుమార్‌పై కేసు పెట్టడంతో, అక్కడి పోలీసులు అతనితో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు నిరంజన్‌ వారి సమీప బంధువును ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో శిరీష వెళ్లి వారి తల్లిదండ్రులను ప్రశ్నించింది. దీంతో వారు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top