పగవారికీ ఇంతటి కష్టమొద్దు

Husband And Wife Deceased With Corona In Anantapur District - Sakshi

వారం క్రితం కరోనాతో మాజీ సైనికుడి మృతి 

తాజాగా ఆయన భార్యనూ కబళించిన వైరస్‌ 

కడసారి చూపునకు నోచుకోలేని బిడ్డలు 

అనంతపురం క్రైం: కోవిడ్‌ మహమ్మారి బంధాలను విచ్ఛిన్నం చేస్తోంది. కడసారి చూపునకు కూడా నోచుకోకుండా చేస్తూ కన్నీళ్లు పెట్టిస్తోంది. పగ వారికి కూడా ఇంతటి కష్టం రాకూడదు అనుకునేంతటి పరిస్థితి నెలకొల్పుతోంది. అనంతపురం నగరంలో అటువంటి దయనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. నగరంలోని హౌసింగ్‌ బోర్డులో నివాసముండే మాజీ సైనికుడు అబ్దుల్‌ రజాక్‌ కరోనా కోరలకు చిక్కి వారం క్రితమే ప్రాణాలు వదిలారు. వైరస్‌ బారిన పడిన ఆయన భార్య షేక్‌ గౌసియా కూడా తాజాగా బుధవారం మృత్యువాత పడింది. (మురుగు నీటిలోనూ కరోనా వైరస్‌ ఆనవాళ్లు)

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు షేక్‌ అర్షద్, షేక్‌ షబ్నం. షబ్నం దుబాయ్‌లో ఉంటోంది. అర్షద్‌ ఇంటి వద్దే సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. కూతురు దుబాయ్‌లో ఉండడంతో తల్లిదండ్రుల కడసారి చూపులకు నోచుకోలేదు. కోవిడ్‌ ఎంతపని చేసింది భగవంతుడా అంటూ కుమారుడు, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. (పేద దేశాలకూ టీకా అందాలి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top