‘మురుగు నీటి ద్వారా వైరస్‌ వ్యాప్తి జరగదు’

CCMB Comments On Corona Virus In Sewage Water - Sakshi

సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి

హైదరాబాద్‌: మహానగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ సీసీఎంబీ  కీలక విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్‌ కేవలం ముక్కు, నోటి నుంచి వెలువడే స్రావాల ద్వారా మాత్రమే వ్యాప్తిచెందుతుండగా తాజాగా మురుగు నీటిలోనూ వైరస్‌ ఆనవాళ్లు ఉంటాయని సీసీఎంబీ తెలిపింది. అయితే మురుగు నీటిలో వైరస్‌ ఉనికి గుర్తించినా ఇది వేరొకరికి సంక్రమించదని స్పష్టం చేసింది. సీసీఎంబీతో కలిసి సీఎస్‌ఐర్‌, ఐఐసీటీ తదితర సంస్ధలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 80 శాతం మురుగు నీటి కేంద్రాల్లో వైరస్‌ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ పరీక్షలన్ని సీసీఎంబీ కరోనా పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. మరోవైపు ఈ పరీక్షలలో పాల్గొనడానికి ఐఐసీటీ నుండి మునుపాటి హేమలత, హరీష్‌ శంకర్‌, వెంకట్‌ మోహన్‌, సీసీఎంబీ నుంచి ఉదయ్‌ కిరణ్‌, కుంచా సంతోష్ కుమార్‌, రాకేశ్‌ మిశ్రాలు పాల్గొన్నారు. వివిధ అధ్యయనాల చేయడం ద్వారానే వైరస్‌ మూలాలను కనుక్కోవచ్చని, తద్వారా వైరస్‌ నిరోధానికి ప్రణాళికలు రచించవచ్చని సీసీఎంబీ పేర్కొంది.
చదవండి: మధుమేహ నిర్ధారణకు కొత్త మార్గం!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top