
రంగుల పండుగ హోలీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, అమరావతి: రంగుల పండుగ హోలీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు ఆగమనాన్ని తెలియజేసే విధంగా హోలీని దేశవ్యాప్తంగా ఆనందంగా, ఉల్లాసంగా జరుపుకుంటారని సీఎం పేర్కొన్నారు. ‘‘ఇంద్ర ధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
ఇంద్రధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.#Holi
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 18, 2022