ఏపీలోనే ఆశా వర్కర్లకు ఎక్కువ వేతనాలు.. వెల్లడించిన కేంద్రం

Higher wages for Asha workers in AP - Sakshi

సాక్షి,అమరావతి: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఆశా వర్కర్లకు అత్య­ధిక ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతు­న్నాయి. ఏపీ ఇస్తున్నట్లుగా ఇతర ఏ రాష్ట్రా­ల్లోనూ ఆశా వర్కర్లకు నెలకు రూ. పది వేల ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వడం లేదని ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లో ఆశా వర్కర్లకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహక మొత్తా­లను ఆ మంత్రిత్వ శాఖ వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌ తరువాత తెలంగాణలో నెలకు రూ. 7,500లు ప్రోత్సా­హకం అందుతోందని,  ఆ తరువాత కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో రూ.6 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని కేంద్రం పేర్కొంది. కమ్యూనిటీ హెల్త్‌ వలంటీర్లుగా భావించే ఆశా వర్కర్లకు నెలకు రూ. 2 వేలు చొప్పున కేంద్రం ప్రోత్సాహకంగా ఇస్తోందని, అలాగే జాతీయ స్థాయి ఆరోగ్య కార్యకలాపాలు పనితీరు ఆధారంగా కూడా కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది.

దీనికి అదనంగా రాష్ట్ర ప్రభు­త్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల ప్రణాళికలు అమలు ఆధారంగా ద్రవ్య ప్రోత్సాహకాలు అందించే సౌలభ్యం కల్పించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చే రూ. 2 వేలకు అదనంగా మరో రూ. 2 వేలు కలిపి నెలకు రూ. 4 వేలు ఇచ్చేది. అది కూడా ఆరు నెలలైనా ఇవ్వని పరిస్థితులు ఉండేవి.

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేసిన సందర్భంలో ఆశా వర్కర్ల వినతులను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2019, ఆగస్టు 17న ఆశా వర్కర్ల వేతనాలను నెలకు రూ. 10,000లకు పెంచుతూ జీవో ఎంఎస్‌ నం.87 జారీ చేయించారు. దీంతో రాష్ట్రంలోని 43,767 మంది ఆశా వర్కర్లు లబ్ధి పొందుతున్నారు. 

వివిధ రాష్ట్రాల్లో ఆశా వర్కర్లకు నెలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఇలా..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top