
ఆదివారం రాత్రి తన భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్‌ఫైర్ అయ్యింది. ఆమె గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో భార్య సూర్య రత్నప్రభ అక్కడికక్కడే మృతి చెందింది.
సాక్షి, విజయవాడ: తుపాకీ పేలి హోంగార్డు భార్య మృతి చెందిన ఘటన నగరంలో జరిగింది. సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ శశిభూషణ్ వద్ద అసిస్టెంట్‌గా హోంగార్డు వినోద్ విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం శశిభూషణ్ అనంతపురం క్యాంప్‌కు వెళ్లగా.. హోంగార్డు వినోద్ వద్ద ఏఎస్పీ తుపాకీ ఉంది.
హోంగార్డు.. ఆదివారం రాత్రి తన భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్‌ఫైర్ అయ్యింది. ఆమె గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో భార్య సూర్య రత్నప్రభ అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
అమ్మో.. కింగ్ కోబ్రా: భయంతో జనం పరుగులు
పాజిటివ్ వచ్చింది బాబూ; పకోడీలు వేసి వస్తా!