విజయనగరంలో గుజరాత్‌ యువతుల హల్‌చల్‌

Group Of Women From Gujarat Hulchul In Parvathipuram Roads - Sakshi

పార్వతీపురం: విజయనగరం జిల్లాలో గుజరాత్‌ యువతులు హల్‌చల్‌ చేస్తున్నారు. పార్వతీపురం రోడ్లపై గుంపులుగా తిరుగుతూ స్థానికంగా ఆందోళన రేకెత్తించారు. వారు భాష, యాస కాస్త భిన్నంగా ఉండటంతో ఈ యువతులపై మీడియా ఫోకస్‌ చేసింది. ప్రధానంగా వీరిపై వాహనదారులు..  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. వాహనదారులను ఆపి డబ్బులు డిమాండ్‌ చేయ‍డమే యువతులపై ఫిర్యాదుకు కారణం.

కాగా, తాము గుజరాత్‌లో ఉపాధి కోల్పోయిన కారణంగా ఇలా వచ్చామని సదరు యువతులు పోలీసులకు చెప్పుకొచ్చారు. ఉపాధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామని వివరణ ఇచ్చే యత్నం చేశారు.  వీరు ఒక లాడ్జిలో మకాం వేసే ఇలా రోడ్లపై తిరుగుతున్నారనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తం 24 మంది మహిళలను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. వీరిని తిరిగి అహ్మదాబాద్‌కు పంపించే యత్నం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top