దివ్య త‌ల్లిదండ్రుల‌కు రూ.10 ల‌క్ష‌ల చెక్కు అంద‌జేత‌ | Govt Given Rs 10 lakh Cheque To The Divya Tejaswini Family | Sakshi
Sakshi News home page

దివ్య త‌ల్లిదండ్రుల‌కు రూ.10 ల‌క్ష‌ల చెక్కు అంద‌జేత‌

Oct 22 2020 5:24 PM | Updated on Oct 22 2020 5:49 PM

Govt Given  Rs 10 lakh Cheque To The Divya Tejaswini Family  - Sakshi

సాక్షి, విజ‌య‌వాడ :  ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్‌ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్ర‌భుత్వం త‌ర‌పున విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్‌ దివ్య కుటుంబ‌స‌భ్యుల‌కు ప‌ది ల‌క్ష‌లు చెక్కును అంద‌జేశారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి  చ‌లించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట‌నే వారి  కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. హామీ ఇచ్చిన 48 గంట‌ల్లోనే దివ్య త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌భుత్వం చెక్కును అంద‌జేసింది.  చ‌క్క‌గా చ‌దువుకునే దివ్య జీవితం నాశ‌నం చేసిన నాగేంద్ర‌కు క‌ఠిన శిక్ష ప‌డుతుంద‌ని దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జ‌గ‌న్ దివ్య త‌ల్లిదండ్రుల‌కు భ‌రోసా ఇచ్చార‌ని, ప్ర‌భుత్వం త‌ర‌పున , పార్టీ త‌ర‌పున వారికి అండ‌గా ఉంటామ‌ని పేర్కొన్నారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది)

సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌హాయం మ‌ర‌వ‌లేనిద‌ని దివ్య త‌ల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ అన్నారు. మా బాధను విని  సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ధైర్యాన్ని ఇచ్చార‌ని, ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అందరూ మాకు అండగా ఉన్నారని తెలిపారు.  ఆర్థిక సహాయం చేస్తారని  ఊహించలేదని, మా కుటుంబ పరిస్థితులు అర్ధం చేసుకొని సహాయం చేసిన సీఎం జ‌గ‌న్‌కి  రుణపడి ఉంటామ‌న్నారు. ఈ కేసులో త‌మ బిడ్డ‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని పేర్కొన్నారు. (సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement