కరోనా మార్గదర్శకాలకు లోబడే చవితి వేడుకలు | Governor Biswabhusan Harichandan Wishes On Vinayaka Chavithi | Sakshi
Sakshi News home page

కరోనా మార్గదర్శకాలకు లోబడే చవితి వేడుకలు

Aug 21 2020 11:41 AM | Updated on Aug 21 2020 12:44 PM

Governor Biswabhusan Harichandan Wishes On Vinayaka Chavithi - Sakshi

సాక్షి, విజయవాడ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేశారు. దేశవ్యాప్తంగా ఈ  పండుగను హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారని, యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొనటం ప్రత్యేకమని గవర్నర్ పేర్కొన్నారు. భక్తులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా చేసే ప్రయత్నాలను సఫలం చేసుకునే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించాలని విఘ్నేశ్వరుడిని పూజిస్తారని బిశ్వ భూషణ్ హరిచందన్ వివరించారు. ఈ పర్వదినాన ప్రజలు తమ భవిష్యత్తు కార్యక్రమాల విజయవంతాన్ని అకాంక్షిస్తూ గణేశుడికి ప్రార్థనలు చేయడం ఆచారంగా వస్తుందని గవర్నర్  తెలిపారు. (మళ్లీ ఉద్యోగ ‘సంబరం’)

కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితులను అధిగమించి, శాంతి, సామరస్యంతో జీవితాన్ని గడపడానికి అవసరమైన శక్తిని విశ్వ జనావళికి ప్రసాదించాలని తాను విగ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అధికారులు జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలు, ఆరోగ్య ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని, ఇంటి వద్దే ఉండి పండుగను జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించటంలో అధికార యంత్రాంగానికి సహకరించడం ద్వారా దానికి వ్యతిరేకంగా సాగే యుద్దంలో భాగస్వాములు కావాలని గవర్నర్ హరిచందన్ పిలుపునిచ్చారు. (సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీశైలం పర్యటన రద్దు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement