ఆ పోస్టు పెట్టించింది నేనే: గోరంట్ల

సాక్షి, రాజమహేంద్రవరం : వెంకటగిరిలో వినాయక విగ్రహానికి మలినం పూసిన ఘటనపై మత విద్వేషాలకు తావు లేకుండా చూడాలని చెప్పి, తన పీఏతో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టించానని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. అయితే దాన్ని నేరంగా భావించి అతడిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఐ, ఎస్పీలకు ఫోన్ చేసి, నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గోర్లంట పీఏ చిటికన సందీప్‌ను పోలీసులు మంగళవారం శ్రీశైలంలో అరెస్ట్ చేశారు. బొమ్మూరు స్టేషన్‌కు తీసుకువచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించారు. చదవండి: విగ్రహం మలినం కేసులో టీడీపీ నేత అరెస్టు
చదవండి: శ్రీరాం.. నీ బండారం బయటపెడతా!
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి