శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రేపు గరుడోత్సవం.. భక్తులకు టీటీడీ సూచనలు | Garudotsavam Tomorrow In Tirumala TTD Instructions For Devotees | Sakshi
Sakshi News home page

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రేపు గరుడోత్సవం.. భక్తులకు టీటీడీ సూచనలు

Sep 21 2023 1:29 PM | Updated on Sep 21 2023 2:39 PM

Garudotsavam Tomorrow In Tirumala TTD Instructions For Devotees - Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు(శుక్రవారం) గరుడోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో అధిక సంఖ్యలో భక్తుల వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంది టీటీడీ. భారీ భద్రతను ఏర్పాటు చేసింది. 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకూ ద్విచక్రవాహనాలకు అనుమతి రద్దు చేశారు. 

భక్తులకు టీటీడీ పలు సూచనలు
►ట్రాఫిక్ డైవర్షన్, పార్కింగ్ ప్రాంతాల వివరాలు.
►సూచించిన ప్రాంతాలలోనే వాహనాలు పార్క్ చేసుకోవాలి.
►పార్కింగ్‌కి ముందుగా పాస్‌లు కేటాయించనున్న పోలీసులు.
►చెన్నై నుండి వచ్చే వాహనాలకు వడమాల పేట టోల్ ప్లాజా వద్ద ఉన్న అగస్త్య ఎన్‌క్లేవ్‌ తిరుచానూరు వద్ద ఉన్న మార్కెట్ యార్డు.
►కడప నుండి వచ్చే వాహనాలకు కుక్కల దొడ్డి వద్ద ఉన్న కేశవరెడ్డి హై స్కూల్, కరకంబాడి వద్ద ఉన్న ఎస్.వి ఇంజనీరింగ్ కళాశాల
►చిత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు చంద్రగిరి సమీపంలో ఉన్న  ఐతే పల్లి, జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్.
►మదనపల్లి నుండి వచ్చే వాహనాలకు విధ్యానికేతన్ కాలేజి సమీపంలో ఉన్న  కే.ఎం.ఎం కాలేజ్, జూ పార్క్ రోడ్డులో ఉన్న  దేవలోక్.
►శ్రీకాళహస్తి నుండి వచ్చే వాహనాలకు  రేణిగుంట సమీపంలో ఉన్న ఆర్ మల్లవరం పెట్రోల్ బంక్ వద్ద, తిరుచానూరు వద్ద ఉన్న మార్కెట్ యార్డు
కరకంబాడి వద్ద ఉన్న  ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల పార్కింగ్ పాసులు కేటాయిస్తారు.
►జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్, భారతీయ విద్యాభవన్‌
►మెటర్నిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్, ఎస్.వి మెడికల్ కాలేజ్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్‌ల యందు టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ పార్కింగ్‌కు అనుమతి.
►అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ వద్ద కేవలం ద్విచక్ర  వాహనాలకు మాత్రమే పార్కింగ్ అనుమతి.

తిరుమలలో GNC నుండి వాహనాలు పార్కింగ్ ప్రాంతాలు..

#️⃣    VVIP పెద్ద బ్యాడ్జెస్ వాహనాలు రాంభగీచ పార్కింగ్ ప్రాంతం.

#️⃣    VIP చిన్న బ్యాడ్జెస్ వాహనాలు ముల్లగుంట, సప్తగిరి గెస్ట్ హౌస్ పార్కింగ్ ప్రాంతాలు. 

#️⃣    సాధారణ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా పార్కింగ్ ప్రాంతాలకు దారి మళ్ళించబడును.

భక్తులు తమ చిన్న పిల్లలు, వృద్దులను జాగ్రత్తగా చూసుకోవాలి
►భక్తుల సౌకర్యార్థం తిరుపతి APSRTC వారు బస్ స్టాండ్ నుండే కాకుండా తిరుపతిలోని ముఖ్యమైన కూడల్ల  వద్ద నుండి కూడా APSRTC బస్సులను తిరుమలకు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement