breaking news
garudostavam celebrations
-
తిరుమలలో భక్తుల రద్దీ అప్డేట్.. నేడు గరుడోత్సవం
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి తొమ్మిది కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,763 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.56 కోట్లు. బుధవారం తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,377గా ఉంది. మరోవైపు.. తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు ఐదవరోజుకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు చేరుకున్నాయి. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. నేడు గరుడోత్సవం జరుగుతుంది. గరుడోత్సవానికి తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గరుడోత్సవంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణగా లక్ష్మీ కాసులహారం, సహస్రనామ కాసుల హారం అలంకరిస్తారు. నేడు గర్భాలయం దాటి వెలుపలి రానున్న ఆభరణాలు. ఇదిలా ఉండగా.. గరుడోత్సవం సందర్బంగా తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు రద్దు చేశారు. 4000 మంది పోలీసులు, 1000 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో గరుడోత్సవానికి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్యాలరీలో రెండు లక్షలమంది వాహన సేవలు వీక్షించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అధిక రద్దీ వస్తే, అందరికి గరుడోత్సవ దర్శనం కల్పించేలా టీటీడీ అధికారుల చర్యలు తీసుకున్నారు. మాడవీధుల్లో ప్రత్యేక క్యూ లైన్ ద్వారా వెలుపల భక్తులు వేచి ఉన్నారు. 14 రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు గరుడోత్సవంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. On the fourth day evening of the ongoing Navaratri Brahmotsavams in Tirumala today, Sri Malayappa donned Gajendra Moksha Alankaram to bless His devotees along the four Mada streets. pic.twitter.com/yGtOAnWkC1 — Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 18, 2023 -
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రేపు గరుడోత్సవం.. భక్తులకు టీటీడీ సూచనలు
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు(శుక్రవారం) గరుడోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో అధిక సంఖ్యలో భక్తుల వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంది టీటీడీ. భారీ భద్రతను ఏర్పాటు చేసింది. 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకూ ద్విచక్రవాహనాలకు అనుమతి రద్దు చేశారు. భక్తులకు టీటీడీ పలు సూచనలు ►ట్రాఫిక్ డైవర్షన్, పార్కింగ్ ప్రాంతాల వివరాలు. ►సూచించిన ప్రాంతాలలోనే వాహనాలు పార్క్ చేసుకోవాలి. ►పార్కింగ్‌కి ముందుగా పాస్‌లు కేటాయించనున్న పోలీసులు. ►చెన్నై నుండి వచ్చే వాహనాలకు వడమాల పేట టోల్ ప్లాజా వద్ద ఉన్న అగస్త్య ఎన్క్లేవ్ తిరుచానూరు వద్ద ఉన్న మార్కెట్ యార్డు. ►కడప నుండి వచ్చే వాహనాలకు కుక్కల దొడ్డి వద్ద ఉన్న కేశవరెడ్డి హై స్కూల్, కరకంబాడి వద్ద ఉన్న ఎస్.వి ఇంజనీరింగ్ కళాశాల ►చిత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు చంద్రగిరి సమీపంలో ఉన్న ఐతే పల్లి, జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్. ►మదనపల్లి నుండి వచ్చే వాహనాలకు విధ్యానికేతన్ కాలేజి సమీపంలో ఉన్న కే.ఎం.ఎం కాలేజ్, జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్. ►శ్రీకాళహస్తి నుండి వచ్చే వాహనాలకు రేణిగుంట సమీపంలో ఉన్న ఆర్ మల్లవరం పెట్రోల్ బంక్ వద్ద, తిరుచానూరు వద్ద ఉన్న మార్కెట్ యార్డు కరకంబాడి వద్ద ఉన్న ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల పార్కింగ్ పాసులు కేటాయిస్తారు. ►జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్, భారతీయ విద్యాభవన్ ►మెటర్నిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్, ఎస్.వి మెడికల్ కాలేజ్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్ల యందు టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ పార్కింగ్‌కు అనుమతి. ►అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ వద్ద కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్ అనుమతి. తిరుమలలో GNC నుండి వాహనాలు పార్కింగ్ ప్రాంతాలు.. #️⃣ VVIP పెద్ద బ్యాడ్జెస్ వాహనాలు రాంభగీచ పార్కింగ్ ప్రాంతం. #️⃣ VIP చిన్న బ్యాడ్జెస్ వాహనాలు ముల్లగుంట, సప్తగిరి గెస్ట్ హౌస్ పార్కింగ్ ప్రాంతాలు. #️⃣ సాధారణ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా పార్కింగ్ ప్రాంతాలకు దారి మళ్ళించబడును. భక్తులు తమ చిన్న పిల్లలు, వృద్దులను జాగ్రత్తగా చూసుకోవాలి ►భక్తుల సౌకర్యార్థం తిరుపతి APSRTC వారు బస్ స్టాండ్ నుండే కాకుండా తిరుపతిలోని ముఖ్యమైన కూడల్ల వద్ద నుండి కూడా APSRTC బస్సులను తిరుమలకు ఏర్పాటు చేశారు. -
వైభవం..పున్నమి గరుడోత్సవం