సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌: ఏపీ​ ప్రభుత్వం | Free Ration For Sex Workers In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌: ఏపీ​ ప్రభుత్వం

Published Wed, Nov 4 2020 8:30 AM | Last Updated on Wed, Nov 4 2020 9:39 AM

Free Ration For Sex Workers In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సెక్స్‌ వర్కర్లకు ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ అందించనుంది. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌ అందజేయాలని సుప్రీం కోర్టు గత నెలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్, లీగల్‌ ఆర్గనైజేషన్లు గుర్తించిన సెక్స్‌ వర్కర్లకు రేషన్‌ పంపిణీ చేయడంతోపాటు ఆ వివరాలను తమకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారంగా నవంబర్‌ నెల రేషన్‌ అందజేయనుంది.   (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్) 

చౌకధరల దుకాణాలు, అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా రేషన్‌ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రంలో 1.22 లక్షల మంది సెక్స్‌ వర్కర్లు ఉన్నట్టు ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ గుర్తించింది. వీరిలో హోమో సెక్సువల్స్‌తోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఎంత రేషన్‌ ఇస్తోందో అంతే మొత్తంలో పంపిణీ చేయనుంది.    (ఇంటింటికీ కొళాయి.. ప్రతిరోజూ మంచినీళ్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement