విషాదం.. నలుగుర్ని మింగేసిన మొలకలచెరువు | Four People Died In Annamayya District | Sakshi
Sakshi News home page

విషాదం.. నలుగుర్ని మింగేసిన మొలకలచెరువు

Apr 26 2025 9:26 PM | Updated on Apr 26 2025 9:32 PM

Four People Died In Annamayya District

అన్నమయ్య జిల్లా : జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. ములకల చెరువు పెద్ద చెరువు నలుగుర్ని మింగేసింది. మొలకలచెరువు పెద్దచెరువు వద్ద తల్లిదండ్రులతో కలిసి బట్టలు ఉతకడానికి  లావణ్య (12) నందకిషోర్ (10)లు అక్కడికి వచ్చారు. చెరువులో దిగుతుండగా మునిగిపోతున్న సమయంలో చిన్నారులు కేకలు వేశారు. 

అక్కడే ఉన్న లావణ్య తండ్రి మల్లేష్ చిన్నారులను రక్షించే క్రమంలో మునిగిపోయాడు. చిన్నారులు లావణ్య, నంద కిషోర్ లతో కలిసి పక్కంటి చిన్నారి నందిత(11) కూడా చెరువులో దిగి మునిగిపోయింది. మృతి చెందిన వారిని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను మొలకలచెరువు పోలీసులు వెలికి తీశారు.మృతి దేహాలను చూసి మృతులు కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. దీంతో గ్రామంలో పూర్తిగా విషాద చాయలు అలుముకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement