
తాడేపల్లి: రేషన్ డోర్ డెలివరీ నిలిపివేయడంపై.. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇప్పటికే వలంటీర్లను తొలగించి లక్షలాది మంది కుటుంబాలను కూడా వీధిన పడేశారు. ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీని నిలిపివేయడం దుర్మార్గ చర్య అని అన్నారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉన్న సహాయకులను తొలగించి వారి జీవనాధారం లేకుండా చేశారు. సచివాలయ వ్యవస్ధను నిర్వీర్యం చేసేలా.. ఉద్యోగులను కూడా రేషనలేజేషన్ పేరుతో కుదించారు. మేం అధికారంలోకి రాగానే లక్షల ఉద్యోగాలంటూ ఓట్లు దండుకున్నారు. తీరా ఇప్పుడు ఉన్న ఉద్యోగుల పొట్టకొట్టడం అత్యంత దారుణం.
నిజంగా రేషన్ వాహనాల వల్ల అవినీతి జరిగితే ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారు?, ఎంత అవినీతి జరిగిందో చెప్పాలి?. ఎండీయూ వాహనాల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే వైఎస్ఆర్ సీపీ తరపున అందోళన చేస్తాం. ఎండీయూ ఆపరేటర్లకు అండగా నిపడతామని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.