ఆపరేషన్‌ టేబుల్‌.. పేషెంట్‌గా నాగుపాము | farmer saves injured cobra and gets it treated | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ టేబుల్‌.. పేషెంట్‌గా నాగుపాము

Jun 8 2026 9:51 AM | Updated on Jun 8 2026 11:14 AM

farmer saves injured cobra and gets it treated

తూర్పు గోదావరి జిల్లా: పాము పేరు వింటేనే అందరూ భయపడతారు. ఇక నేరుగా చూస్తే దూరంగా పారిపోతారు. అలాంటిది పొలంలో మట్టి తీస్తుండగా గాయపడిన నాగు పాముపై జీవ కారుణ్యాన్ని చూపించి దానిని కాపాడాడు ఒక రైతు. ఆ విష నాగును ఎంతో చాకచక్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వి.సావరంలో గుత్తుల సత్యనారాయణ శనివారం తన పొలంలో మట్టిని తీస్తుండగా నాగుపాముకు దెబ్బ తగిలింది. వెంటనే ఆ పామును వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లారు. వెటర్నరీ అసిస్టెంట్‌ వెంకటేశ్వరరావు పాముకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి కుట్లు వేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement