పెదగంట్యాడ: నేవీ అధికారినని చెప్పుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన కేసులో గాడి సత్య సూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్‌కు 12 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ గాజువాక అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వై.లక్ష్మి తీర్పు చెప్పారు. న్యూపోర్టు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తాను నేవీ అధికారినని చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి చలపతిరావు లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. నకిలీ ఐడీ కార్డులు, నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసి మోసాలకు పాల్పడ్డాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో అతనిపై కేసులు నమోదు చేశారు. ఆపై బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. 2017లో అతనిపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేశారు. 2025 డిసెంబర్‌లో నిందితుడిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత నిందితునికి 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రూ.30వేలు జరిమానా కూడా విధించారు. బాధితులకు రూ.18.6 లక్షలు చెల్లించాలని ఆదేశించారు.


