తిరుపతి: హోటళ్లకు ఆగని బాంబు బెదిరింపులు | Fake Bomb Threat Mails To Tirupati Hotels, More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుపతి: హోటళ్లకు ఆగని బాంబు బెదిరింపులు

Oct 28 2024 9:01 AM | Updated on Oct 28 2024 10:23 AM

Fake Bomb Threat Mails To Tirupati Hotels

సాక్షి,తిరుపతి: పుణ్యక్షేత్రం తిరుపతిలోని ప్రధాన హోటళ్లకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మరోపక్క బాంబు బెదిరింపులకు సంబంధించి ఫేక్ మెయిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించి ఫేక్‌మెయిల్స్‌ పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఫేక్‌మెయిల్స్‌పై ఎన్‌ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. తిరుపతిలోని ఏడు హోటల్స్‌తో పాటు రెండు ఆలయాలకు జాఫర్‌సాదిక్‌ పేరుతో బాంబు బెదిరింపు ఫేక్‌మెయిల్స్‌ వచ్చినట్లు ప్రాథమికంగా తేల్చారు. 

 మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్‌,మెయిళ్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిపై విమానయాన శాఖ  సీరియస్‌గా తీసుకుంది. విమానాలకు బెదిరింపు మెయిళ్లు పంపిస్తే బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించింది.

ఇదీ చదవండి: హత్యకు యత్నం.. పీఎస్‌కు వెళితే అక్కడా దాడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement