‘సంక్షేమం’ కోసం.. అడ్డదారులు! 

Fake Aadhaar Cards In Srikakulam District - Sakshi

ఆధార్‌కార్డులలో జోరుగా వయస్సు మార్పులు

శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి, పర్లాకిమిడి, ఎల్‌ఎన్‌పేట, బరంపురం కేంద్రాలుగా అడ్డగోలు బాగోతం  

ఒక్కో కార్డుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల చొప్పున వసూలు

తాజాగా పట్టుబడ్డ నకిలీ ఆధార్‌కార్డుల ముఠా  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నందిగాం మండలం దిమ్మడిజోలలో ఇటీవల తొమ్మిది మంది పింఛన్లను అధికారులు నిలిపేశారు. అధార్‌ కార్డులలో వయస్సు మార్పు చేశారని గుర్తించిన తరువాత ఈ చర్య తీసుకున్నారు. సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో వైఎస్సార్‌ చేయూత పథకం కోసం నెల రోజుల వ్యవధిలో అధార్‌ కార్డులో వయస్సు మార్పులు చేసి కొత్త వాటితో దరఖాస్తులు చేశారు. దీన్ని గమనించిన సచివాలయం సిబ్బంది ఆరాతీసేసరికి అసలు విషయం వెలుగు చూసింది. శ్రీకాకుళంలోని ఓ ఆధార్‌ సెంటర్‌లో పదిమంది వరకు ఇలా వయస్సు మార్పులు చేయించుకున్నారని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరు వయస్సు మార్పు కోసం రూ. 5 వేలు చొప్పున సమరి్పంచినట్టు కూడా తెలిపారు. ఫిర్యాదు చేయండని అడిగేసరికి ఎందుకొచ్చింది వాళ్లంతా మా వాళ్లేనని దాటవేస్తున్నారు. 

ఈ రెండు చోట్లేకాదు జిల్లాలో పలుచోట్ల పింఛన్లు, వైఎస్సార్‌ చేయూత, ఇతరత్రా సంక్షేమ పథకాల కోసం అధార్‌కార్డులలో వయస్సు మార్పులు చేస్తున్నారు. ఏటా రూ. 18,750 వచ్చే చేయూత పథకాన్ని, నెలకు 2,250 రూపాయలు వచ్చే సామాజిక పింఛన్లను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆరాటంతో పలువురు అడ్డదారులు తొక్కుతున్నారు. పొరుగు జిల్లాలోని చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎల్‌ఎన్‌పేట, శ్రీకాకుళం, ఒడిశాలోని పర్లాకిమిడి, ఏడు మైళ్లరాయి, బరంపురం వద్ద ఆధార్‌ సెంటర్లు, మీసేవా కేంద్రాల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆధార్‌ కార్డులలో మార్పులు చేయిస్తున్నారు. గత కొన్నాళ్లుగా జిల్లాలో ఈ ప్రాక్టీసు జరుగుతోంది. కాసులకు కక్కుర్తిపడిన నిర్వాహకులు ఇష్టం వచ్చినట్టు వయస్సు వేసేసి కొత్త ఆధార్‌ కార్డులు వచ్చేలా చేస్తున్నారు. దీంతో 45 ఏళ్లు, 50 ఏళ్లు ఉన్న వారు కూడా 65 ఏళ్ల వయస్సు ఉన్నట్టుగా మార్చుకుని పింఛన్లకు అర్హత సాధిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ముడుపుల బాగోతం నడుస్తున్నది. ఒక్కొక్క కార్డులో వయస్సు మార్చేందుకు రూ. 5 వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వసూలు చేసి భారీగా లబ్ధిపొందుతున్నారు.  

సహకరిస్తున్న మీసేవ కేంద్రాల నిర్వాహకులు 
ఇదే సమయంలో కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా అత్యాశకు పోయి వారికి సహకరిస్తున్నారు. కొన్ని ఆధార్‌ సెంటర్లలో ఇదేరకమైన మాల్‌ ప్రాక్టీసు జరుగుతోంది. వయస్సు మార్చి డబ్బులు సంపాదించడమే పనిగా వీరు పెట్టుకున్నారు. సాధారణంగా ఏదైనా ధ్రువీకరణ పత్రం చూసి ఆధార్‌ కార్డులో వయస్సు మార్చేందుకు ఆప్‌లోడ్‌ చేయాలి. కానీ పలు కేంద్రాల నిర్వాహకులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయస్సు మార్పులు చేసి అప్‌లోడ్‌ చేసేస్తున్నా రు. అప్‌లోడ్‌ అయ్యాక వయస్సు మార్పుతో కూడిన ఆధార్‌ కార్డులు జారీ అయిపోయాయి. వీటిని పట్టుకుని పింఛను, వైఎస్సార్‌ చేయూత పథకాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. కాకపోతేసచివాలయం సిబ్బంది కొన్నిచోట్ల క్షుణ్ణంగా పరిశీలించి నెలల వ్యవ«ధిలోనే వయస్సు ఎలా మారిపోయిందని నిలదీసేసరికి కొన్నిచోట్ల ఆధార్‌ అక్రమాలు బయటపడుతున్నాయి.  

పట్టుబడ్డ ముఠాతో వాస్తవాలు వెలుగులోకి.. 
పర్లాకిమిడిలో వయస్సు మార్పులు చేపడుతున్నారన్న సమాచారంతో సరుబుజ్జిలి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు ఒడిశా కేంద్రంగా పట్టుబడ్డ ముఠా తో అక్రమాలు మరింత రుజువయ్యాయి. ఎస్మాన్‌ మండల్‌ నాయక్, కిల్లారి చిన్నారావు, చింతా డ శ్రీనివాసరావు  బృందంగా ఏర్పడి చేస్తున్న నకిలీ ఆధార్‌ కార్డుల గుట్టును రట్టు చేశారు. ఈ ముఠా సభ్యులు నకిలీ స్టడీ సరి్టఫికెట్లతో పాన్‌కార్డుల వయస్సును మార్చారు. ఆధార్‌ కార్డుల కో సం అప్‌లోడ్‌ చేశారు. 260 కార్డులను తారుమారు చేసి పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా నౌగాడ వద్ద ఆధార్‌ కార్డుల కోసం ఎస్మాన్‌ మండల్‌ నాయక్‌ అనే వ్యక్తి ఒక సరీ్వ సు ప్రొవైడర్‌ ఏర్పాటు చేశారు. ఆయనతో ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన కిల్లారి శ్రీనివాసరావు, చింతాడ శ్రీనివాసరావులు జత కలిసి నకిలీ ఆధార్‌ కార్డులను తయారు చేయడం మొదలు పెట్టారు. నేరుగా ఎల్‌ఎన్‌పేటకు వచ్చి నకిలీ ధ్రువపత్రాలు, పాన్‌కార్డులను మోసపూరితంగా ఉపయోగించి ఆధార్‌ కార్డుల కోసం అప్‌లోడ్‌ చేసిన వ్యవహారం బట్టబయలైంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top