‘ఛలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదు’

Eluru Range DIG Mohan Rao: No Permisson To Chalo Amalapuram Program - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి‌ : సెప్టెంబరు అయిదో తేదిన అంతర్వేది రథం కేసును సీబీఐకు అప్పగించడం జరిగిందని ఏలూరు రేంజ్ డీఐజీ మోహానరావు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పరంగ కొత్త రథం తయారు అవుతుందని వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు ఛలో అమలాపురం అంటు పిలుపునిస్తున్నాయని, ఛలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కోనసీమ ప్రశాంతమైన జిల్లా అని, కోవిడ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 అమలులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదన్న విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీఐజీ ఈ కేసులో అనుమానితులని విచారిస్తున్నామన్నారు. (‘గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదు’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top