
రామకుప్పం: కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలో చిన్నగెరెగపల్లి, పెద్దగెరెగపల్లి, గడ్డూరు, యానాదికాలనీ, దేసినాయనపల్లి గ్రామాల్లో గురువారం రాత్రి భూమి కంపించింది. తహసీల్దార్ దేవరాజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే శుక్రవారం రాత్రి కూడా భూమి లోపల నుంచి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సొంత గ్రామాలను, ఇళ్లను విడిచి మండల కేంద్రమైన రామకుప్పానికి పరుగులు తీశారు. మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు విజలాపురం బాబురెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నితిన్‌రెడ్డి, ఎంపీపీ శాంతకుమారి చంద్రారెడ్డి ప్రజలకు రామకుప్పం ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలో వసతులు ఏర్పాటు చేశారు.