నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు | Dussehra celebrations at Indrakiladri from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

Sep 22 2025 5:02 AM | Updated on Sep 22 2025 5:02 AM

Dussehra celebrations at Indrakiladri from today

సర్వం సిద్ధం –  అక్టోబర్‌ 2 వరకు నిర్వహణ

సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి (విజయ­వాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్‌: దసరా నవ­రాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. సోమవా­రం నుంచి అక్టోబర్‌ 2 వరకు 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారు 11 అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి దర్శనం తొలి­రోజు మినహా రోజూ ఉదయం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. 

ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అక్టోబర్‌ 2 విజయ దశమి రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. కాగా, అమ్మవారు సోమవారం శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా దర్శన­మివ్వను­న్నారు.

శైలపుత్రి అలంకారంలో శ్రీశైల భ్రామరి
దసరా మహోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీశైలం భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement