కనికరించిన పింఛన్‌!

Donela Krishnaveni From East Godavari District Got Disability Pension - Sakshi

పెరవలి: ఆమె పేరు దోనెల కృష్ణవేణి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లి. 35 ఏళ్ల వయసున్న ఆమె పుట్టుకతో దివ్యాంగురాలు(మూగ,చెవుడు). అవివాహితురాలైన ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. పేద కుటుంబం. తండ్రి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తు­న్నాడు. కృష్ణవేణికి వికలాంగ పింఛన్‌ కోసం ఏళ్ల తరబడి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

చంద్రబాబు హయాంలో వైకల్యం 30 శాతమేనంటూ తిరస్కరించారు. జన్మభూమి కమి­టీలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపో­వడంతో తల్లిదండ్రులు ఇక ప్రయత్నాలు మాను­కున్నారు. అయితే వీరి విషయం తెలుసుకున్న పెరవలి ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్‌ చొరవ తీసుకుని ఎంపీడీవో రమేష్‌కు చెప్పి కృష్ణవేణి వికలాంగ పింఛన్‌ దరఖాస్తును ఆన్‌­లైన్‌ చేయించారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌­నా­యు­డి దృష్టికి కూడా ఈ విషయాన్ని ఎంపీపీ తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే ఈ దర­ఖాస్తును తూర్పు­గో­దా­వరి జిల్లా కలెక్టర్‌ మాధవీ­లత దృష్టికి తీసుకెళ్లి పింఛన్‌ మంజూరు చేయించారు. బుధవారం ఖండవల్లిలో నిర్వ­హిం­చిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తల్లి లక్ష్మీపార్వతితో కలసి కృష్ణవేణి పింఛన్‌ అందుకుంది. ఆ సమయంలో తల్లీ కూతుళ్ల ముఖా­ల్లో చెప్పలేని ఆనందం తొ­ణికిసలాడింది. సభలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ‘ఈ రాష్ట్రానికి జగనే సీఎంగా ఉండాలి.. అప్పుడే మా­లాం­టోళ్లకి మేలు జరు­గుతుంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top