దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

Diwali 2020: Kishan Reddy, YV Subbareddy Visits Tirumala - Sakshi

సాక్షి, తిరుమల : కేంద్ర హోశాంఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి పర్వదినంలో స్వామి వారిని దర్శించుకొని, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని కిషన్‌ రెడ్డి తెలిపారు. దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని,  మన దేశ సరిహద్దులైన చైనా, పాక్ సరిహద్దులో సమస్యల నుంచి దేశాన్ని గట్టెకించాలని స్వామి వారిని ప్రార్థించినట్లుత పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ దీపావళి పండుగ దేశ ప్రజల్లో వెలుగులు నింపాలని ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. చదవండి: భవిష్యత్తులో తిరుపతి ఐఐటీది కీలక పాత్ర

తిరుమల : శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్‌ నుంచి దేశానికి విముక్తి రావాలని కోరుకుంటున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. దీపావళి సందర్భంగా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం  వైభవంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారిని వేంచేపు చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక తిరు ఆభరణాలతో అలంకరించి, స్వామి వారికి ప్రత్యేక నివేదనలు సమర్పించామన్నారు.  దీపావళి ఆస్థానం సందర్బంగా స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించి, అక్షితారోపణము, విశేష హారతులు సమర్పించినట్లు తెలిపారు. మంగళ హారతితో దీపావళి ఆస్థానం పరిసమాప్తం అయ్యిందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top