మహాయజ్ఞంలా సాగుతోన్న పెన్షన్ల పంపిణీ

Distribution of YSR Pension Kanuka of December Month Highlights - Sakshi

03:20PM
► ఏపీలో పెన్షన్‌ పంపిణీ ఒక యజ్ఞంగా కొనసాగుతోంది. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అర్హులైన వారికి పెన్షన్‌ను అందిస్తున్నారు.
► మధ్యాహ్నం 3 గంటల వరకు 86.89 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది. మొత్తం 60.50 లక్షల మందికి గానూ 52.57 లక్షల పెన్షనర్లకు రూ. 1226.72 కోట్లు పంపిణీ చేశారు. 

01:00PM
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ 
మధ్యాహ్నం 1 గంట వరకు 83.66 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
మొత్తం 60.50 లక్షల  మందికి గానూ 50.62 లక్షల పెన్షనర్లకు రూ. 1180.85 కోట్లు పంపిణీ

12:00PM
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమం వేగవంతంగా సాగుతోంది. 
మధ్యాహ్నం 12.30 గంటల వరకు 82.43 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది.
మొత్తం 60.50 లక్షల మందికి గానూ 50 లక్షల పెన్షనర్లకు రూ. 1,163.35 కోట్లు పంపిణీ చేశారు.

10:00AM
ఉదయం 10 గంటల వరకు 69.48 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు.
మొత్తం 60.50 లక్షల  మందికి గానూ ఇప్పటిదాకా 42.04 లక్షల పెన్షనర్లకు రూ. 979.82 కోట్లు పంపిణీ చేశారు.

08:00AM
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది.
ఉదయం 8 గంటల వరకు 44.09 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
మొత్తం 60.50 లక్షల  మందికి గానూ 26.67 లక్షల పెన్షనర్లకు రూ. 621.47 కోట్ల పంపిణీ

07:30AM
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్‌ పెన్షన్ కానుక పంపిణీ 
ఉదయం 7 గంటల వరకు 14.25 లక్షల మంది పెన్షనర్లకు రూ. 331.86 కోట్ల పంపిణీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున నుంచే వైఎస్సార్‌ సామాజిక పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, దీర్ఘకాలిక రోగులకు పెన్షన్లు పంపిణీ ఒక మహా యజ్ఞంలా సాగుతోంది. పొద్దుపొడవక ముందే మా ఇంటి తలుపు తట్టి మరీ ఒకటవ తారీఖున అందిస్తున్న పెన్షన్లు ఒక పెద్దకొడుకు కంటే ఎక్కువ బాధ్యత తీసుకుంటున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఈ జన్మంతా రుణపడి ఉంటామని లబ్ధిదారులు అంటున్నారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 60,50,650 మంది లబ్ధిదారులకు పెన్షన్‌ అందించనున్నారు. ఇందుకు గానూ రూ.1,411.42 కోట్ల మొత్తాన్ని మంగళవారం సాయంత్రానికే గ్రామ, వార్డు సచివాలయ ఖాతాల్లో జమ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్‌ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top