బాలికతో పరీక్ష రాయించిన ‘దిశ’ | Disha App Helps Tenth Class Girl Student to Write Exams | Sakshi
Sakshi News home page

బాలికతో పరీక్ష రాయించిన ‘దిశ’

May 4 2022 5:04 AM | Updated on May 4 2022 7:40 PM

Disha App Helps Tenth Class Girl Student to Write Exams - Sakshi

రామాపురం: పదో తరగతి పరీక్షలు రాయనీయకుండా నిర్బంధించిన తండ్రిపై ఓ బాలిక దిశ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బాలికను పరీక్ష కేంద్రంలో హాజరుపర్చారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కల్పనాయునిచెరువు పంచాయతీ మూగిరెడ్డిగారిపల్లెకు చెందిన బాలిక నీలకంట్రావుపేటలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తోంది.  

మూడు పరీక్షలు రాశాక.. పరీక్షలకు వెళ్లొద్దంటూ తండ్రి సోమవారం ఇంట్లో నిర్బంధించాడు. దీంతో ఆ బాలిక దిశ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్‌కానిస్టేబుల్‌ ప్రతాప్‌ వచ్చి బాలికతో పరీక్ష రాయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement