Devineni Avinash Comments Over NTR 100 Years Centenary Celebrations - Sakshi
Sakshi News home page

టీడీపీ, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు: దేవినేని అవినాష్‌

Published Sat, May 27 2023 11:04 AM

Devineni Avinash Comments NTR 100 Years  - Sakshi

సాక్షి, విజయవాడ: దివంగత ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు విజయవాడలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి పాల్గొంటారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్‌ తెలిపారు. ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 

కాగా, దేవినేని అవినాష్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం. మేమూ ఎన్టీఆర్ అభిమానులమే. ఎన్టీఆర్‌కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదు.  టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన మనసున్న నేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు సీఎం జగన్‌. 

కనీవినీ ఎరుగని రీతిలో నిన్న అమరావతిలో జరిగిన ఇళ్ల పట్టాల పండుగకు లబ్ధిదారులు తరలివచ్చారు. చంద్రబాబు సభలకు జనం రావాలంటే డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి. కానీ, సీఎం జగన్‌ మీటింగ్‌కు సంతోషంతో లబ్ధిదారులు తరలివచ్చారు. టీడీపీ నేతలు మూడేళ్లు పేదలకు ఇళ్లు రాకుండా వ్యవస్థల ద్వారా అడ్డుకున్నారు. అమరావతిలో తన పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు మాత్రమే ఉండాలని చంద్రబాబు అనుకున్నాడు.  

దమ్మున్న నాయకుడిగా సీఎం జగన్ పేదల తరపున పోరాడారు.  ఇళ్ల పట్టాల పండుగను చూసి టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు. పేదల సొంతింటి కల నెరవేరుతుంటే చూసిఓర్వలేకపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలను రద్దుచేస్తామంటున్న టీడీపీ నేతలకు సిగ్గుందా?. సెంటు స్థలంపై విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తలలెక్కడ పెట్టుకుంటారు. సీఎం జగన్‌ సభను చూసిన తర్వాత టీడీపీ నేతలకు దిమ్మతిరిగింది. 

ఇది కూడా చదవండి: వివేకా కేసు: చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయికి చేరిందంటే..

Advertisement
 
Advertisement