‘సంపాదన కోసమే వ్యవస్థలను నాశనం చేశాడు’ | Deputy CM narayana Swamy Express Happiness Of YSR Cheyutha Scheme | Sakshi
Sakshi News home page

‘సంపాదన కోసమే వ్యవస్థలను నాశనం చేశాడు’

Aug 12 2020 1:20 PM | Updated on Aug 12 2020 1:41 PM

Deputy CM narayana Swamy Express Happiness Of YSR Cheyutha Scheme - Sakshi

సాక్షి, చిత్తూరు : వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంనారాయణ స్వామి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఒంటరి మహిళలకు ఆర్థికంగా సహాయం చేయడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. కాగా వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చంద్రబాబు చేయలేదంటూ ధ్వజమెత్తారు. ('వైఎస్సార్‌ చేయూత' పథకాన్ని ప్రారంభించిన సీఎం‌ జగన్‌)

ప్రస్తుతం సీఎం జగన్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక పోతున్నారని అందుకే ప్రతి ఒక అభివృద్ధి కార్యక్రమంపైన కోర్టుకు వెళ్తున్నారని మండిపడ్డారు.సొంత మామను వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చిన చంద్రబాబు సంపాదన కోసమే వ్యవస్థను నాశనం చేశాడని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీనామా చేసి మరోసారి కుప్పం నుంచి పోటీ చేసి గెలవాలని డిప్యూటీ సీఎం సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement