ఉద్యోగుల బదిలీల గడువు 9 వరకు పొడిగింపు | Deadline for Govt Employee Transfers Extended to June 9: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల బదిలీల గడువు 9 వరకు పొడిగింపు

Jun 3 2025 4:56 AM | Updated on Jun 3 2025 4:56 AM

Deadline for Govt Employee Transfers Extended to June 9: Andhra pradesh

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ 

బేరసారాల కోసమేనంటున్న ఉద్యోగ వర్గాలు

సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత జారీ చేసిన జీవో ప్రకారం సోమవారంతో గడువు ముగిసింది. వీటిపై మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు మరింత సమయం కోరారు.

దీంతో ఆర్థిక శాఖ  ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై నిషేధం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టంచేశారు. ఉద్యోగుల బదిలీకి సంబంధించి మంత్రులు, కూటమి ఎమ్మెల్యేల బేరసారాలకు సమయం సరిపోకపోవడంతో గడువు పొడిగించారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement