నూతన పరకామణి భవనంలో లెక్కింపు ప్రారంభం

Counting begins in new Parakamani building TTD - Sakshi

తిరుమల: శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకా­మణి భవనంలో ఆదివారం నుంచి లెక్కించడం ప్రారంభించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. నూతన పరకామణి భవనంలో ఆయన పూజలు నిర్వహించి మీడియాతో మా­ట్లా­డారు. బెంగళూరుకు చెందిన దాత ముర­ళీకృష్ణ సహకారంతో నూతన పరకామణి భవ­నాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

తిరుమల పెద్దజీయర్‌ స్వామి వారి ఆశీస్సులతో ఆదివారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి 12 హుండీలను చిన్న లిఫ్ట్‌ సహాయంతో లారీలో తరలించినట్లు చెప్పా­రు. ఇకపై రోజూ అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయన్నారు. త్వరలో ఆలయంలోని పరకామణి మండపాన్ని భక్తులు కూర్చునేందుకు వీలుగా తీర్చిదిద్దుతామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top