ప్రతి గ్రామంలో కరోనా ఐసోలేషన్‌ సెంటర్లు 

Corona isolation‌ centers in every village of AP - Sakshi

గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సెంటర్లలో మౌలిక వసతులు 

రోగులకు నిరంతరం ఏఎన్‌ఎంల పర్యవేక్షణ.. వారానికి రెండు రోజులు వైద్యుల సందర్శన 

మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: అవసరం మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కరోనా ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా సోకి.. ఇంటిలో ఉండి చికిత్స పొందడానికి తగిన వసతి లేనివారి కోసం ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించారు. ప్రతి చోటా పురుషులకు, మహిళలకు వేర్వేరు గదులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో సాధారణ లక్షణాలు ఉన్నవాళ్లు ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే.. ఎక్కువ శాతం మందికి ఒకే పడక గది, ఒకే టాయిలెట్‌ ఉన్నాయి. దీంతో ఆ ఇంటిలో ఎవరైనా కరోనా బారినపడితే.. మిగిలిన కుటుంబ సభ్యులు దూరంగా ఉండటానికి అవకాశం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేదా ఇతర ప్రభుత్వ భవనాల్లో అవసరం మేరకు వెంటనే ఐసొలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 
 
గ్రామ సర్పంచ్‌ల పర్యవేక్షణలో.. 
– కరోనా ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటు, వాటిలో మౌలిక వసతుల ఏర్పాటు బాధ్యతలను ఆయా గ్రామాల సర్పంచ్‌లకు అప్పగించారు.  
– కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే నిర్ధారణ పరీక్ష కోసం వేచి చూడకుండా వెంటనే ఐసోలేషన్‌ కేంద్రానికి తరలిస్తారు. రోగులు తమ ఇంటిలోనే వేరుగా ఒక గదిలో ఉండడానికి ఇష్టపడితే అందుకు ప్రాధాన్యత ఇస్తారు.  
– ఐసొలేషన్‌ సెంటర్‌లో చేరేవారు ఆహారం, దుప్పట్లు, సబ్బు, బ్రష్, మందులు వంటివాటిని వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది.  
– దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చే చోట రోగులకు పౌష్టికాహారం అందజేస్తారు. 
– రోగుల ఆరోగ్య పరిస్థితిని ఏఎన్‌ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒక రిజిస్టర్‌లో నమోదు చేసుకొని.. స్థానిక పీహెచ్‌సీ వైద్యుడికి సమాచారం అందిస్తారు. 
– పీహెచ్‌సీ వైద్యుడు వారంలో రెండు రోజులు ఐసొలేషన్‌ కేంద్రాన్ని సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు.  
– ఎవరికైనా అత్యవసర చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పటికప్పుడు అంబులెన్స్‌ ద్వారా వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చుతారు. 
– కాగా.. ఇంటిలోనే ఉంటూ చికిత్స పొందుతున్న వారి ఇళ్లకు హోం ఐసోలేషన్‌ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తారు.  
– ఐసొలేషన్‌ కేంద్రాల్లో రోజూ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. 
– గ్రామంలో కరోనా కేసుల సంఖ్య జీరోకు చేరే వరకు ఐసోలేషన్‌ కేంద్రాలను కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
– ఐసోలేషన్‌ కేంద్రాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా, మండలాల వారీగా ఎన్ని గ్రామాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. వాటిలో ఎంత మంది చేరారు వంటి వివరాలను వారానికి రెండుసార్లు కమిషనర్‌ కార్యాలయానికి పంపాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-05-2021
May 25, 2021, 02:58 IST
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందులకు సంబంధించి ‘సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌...
25-05-2021
May 25, 2021, 02:52 IST
వాషింగ్టన్‌/బీజింగ్‌: ప్రపంచ పాలిట పెనుగండంగా మారిన కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(వూహాన్‌ ల్యాబ్‌)లోనే పుట్టిందా? అది...
25-05-2021
May 25, 2021, 02:51 IST
విద్యుత్తు.. ఆక్సిజన్‌ కీలకం ‘‘తుపాను కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. తుపాను వల్ల ఒడిశా ప్లాంట్ల...
25-05-2021
May 25, 2021, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదిరోజుల తర్వాత రెండో డోసు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మంగళ వారం (నేటి) నుంచే పునఃప్రారంభమవుతోంది. ఈ మేరకు...
25-05-2021
May 25, 2021, 02:45 IST
కరోనా పొట్టగొట్టింది. ఆకలి రోడ్డెక్కింది. దాతల సాయం కోసం బతుకు‘బండి’ ఇలా బారులుదీరింది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగు...
25-05-2021
May 25, 2021, 02:32 IST
సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కోవిడ్‌–19 పాలసీని రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. టీకాల...
24-05-2021
May 24, 2021, 19:22 IST
సాక్షి, అమరావతి : బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంజక్షన్లు తెప్పించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి...
24-05-2021
May 24, 2021, 16:18 IST
కరోనా బాధితుల్లో ప్రస్తుతం నీళ్ల విరేచనాలు సర్వ సాధారణంగా కనిపిస్తున్న లక్షణం. బాధితుల విసర్జితాల్లో వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ లేదా జెనెటిక్‌...
24-05-2021
May 24, 2021, 15:17 IST
దయచేసి కుక్క పరిస్థితి చూసైనా మమ్మల్ని వదిలేయండి
24-05-2021
May 24, 2021, 15:13 IST
న్యూఢిల్లీ : కోవిడ్‌ బారిన పడిన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధి ముదరకుండా చేసే యాంటీబాటీ కాక్‌టెయిల్‌...
24-05-2021
May 24, 2021, 15:02 IST
ముంబై: మహమ్మారి కరోనాపై పోరులో అండగా ఉండేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముందుకు వచ్చింది. ప్రాణవాయువు కొరతతో కోవిడ్‌...
24-05-2021
May 24, 2021, 14:51 IST
భోపాల్‌: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. ప్రాణవాయువు అందక వందలాది మంది కరోనా బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు....
24-05-2021
May 24, 2021, 13:44 IST
కేం‍ద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలకు, వాస్తవిక పరిస్థితులకు పొంతన లేకుండా పోతోందా?
24-05-2021
May 24, 2021, 12:42 IST
‘‘అదొక విషపు ఇంజక్షన్‌. వ్యాక్సిన్‌ కాదు. అందుకే మేం సరయూ నదిలో దూకాం’’
24-05-2021
May 24, 2021, 12:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించి... కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులను చూస్తున్నాం....
24-05-2021
May 24, 2021, 10:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో... రెండు వేర్వేరు సంస్థలకు చెందిన టీకాలు అదించొచ్చా అనే అంశంపై కేంద్రం...
24-05-2021
May 24, 2021, 10:17 IST
ఇక మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. ...
24-05-2021
May 24, 2021, 10:12 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాప్తితో ఒకవైపు జనం అల్లాడుతుంటే మరోవైపు శ్మశానాల్లో అంత్యక్రియలకు అధికంగా డబ్బులు వసూలు చేస్తుండడం పట్ల తీవ్ర...
24-05-2021
May 24, 2021, 09:59 IST
బంజారాహిల్స్‌: అసలే ఆదివారం.. ఉన్నది నాలుగు గంటల సమయం.. ఏమాత్రం ఆలస్యం చేసినా లాక్‌డౌన్‌ గడువు ముంచుకొస్తుంది. ఉన్న సమయంలోనే...
24-05-2021
May 24, 2021, 09:14 IST
ఐక్యరాజ్యసమితి: కోవిడ్‌–19 ముప్పు తొలగిపోలేదని, మహమ్మారి ఇంకా మనతోనే ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గ్యుటెరస్‌ హెచ్చరించారు. వైరస్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top