రహదారుల అభివృద్ధిలో ముందడుగు 

Construction Of National Highways The Appearance To Change - Sakshi

రహదారులకు మహర్దశ పట్టింది.. జాతీయ రహదారుల నిర్మాణంతో కొత్త జిల్లాల రూపురేఖలు మారనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఫలితంగా రాష్ట్రంలో హైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా.. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.1,490 కోట్లు విడుదల చేసింది. ఎన్‌హెచ్‌–216, ఎన్‌హెచ్‌–165 విస్తరణ పనులు జరుగనున్నాయి.  

నరసాపురం: కోనసీమ, కోస్తా ప్రాంతాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో భాగంగా నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలని కూడా నిర్ణయించారు. బ్రిటిష్‌ కాలం నుంచి ఉన్న వశిష్ట వారధి డిమాండ్‌ ఇన్నాళ్లకు తీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వ యంగా రంగంలోకి దిగి జాతీయ రహదారుల కో సం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిపిన సంప్ర దింపులు సత్ఫలితాలను ఇచ్చాయి. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కు రూ.1,490 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొత్త జిల్లాలో నాలుగు లైన్ల రహదారు లు అందుబాటులోకి రా నున్నాయి.   

దశాబ్దాల కల సాకారం 
కాకినాడ జిల్లాలోని కత్తిపూడి నుంచి ఒంగోలుకు వెళ్లే 216 జాతీయరహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా కోనసీమ, కోస్తా ప్రాంతాలను కలుపుతూ బైపాస్‌ ని ర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ.490 కోట్ల నిధులు కేటాయించింది. కోనసీమ జిల్లాలోని దిండి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర సాపురం మండలంలోని సీతారాంపురం వరకు బై పాస్‌ను నిర్మించనున్నారు. దీంతో జిల్లావాసులు ఎదురుచూస్తున్న నరసాపురంలో వశిష్ట గోదావరిపై వారధి నిర్మాణం కల సాకారం కానుంది. వంతెన నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో స్థల సేకరణ పూర్తిచేసింది.  

ఫలించిన ప్రయత్నం : ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు జిల్లాలో హైవేల నిర్మాణంపై సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఎన్‌హెచ్‌ 216కు బైపాస్, ఎన్‌హెచ్‌ 165 నాలుగు లైన్ల విస్తరణ విషయాలపై సీఎం ద్వారా కేంద్ర మంత్రికి లేఖ ఇప్పించారు.   

రూపురేఖలు మారనున్నాయి  
సీఎం వైఎస్‌ జగన్‌ కృషితోనే నిధులు మంజూర య్యాయి. కొత్త జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1,490 కోట్లను కేంద్రం కేటాయించడం రికార్డు. ఇంత పెద్ద స్థాయిలో నిధుల కేటాయింపు ఎన్నడూ లేదు. వశిష్ట వంతెన నిర్మాణం కూడా పూర్తవుతుంది. రానున్న ఐదేళ్లలో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. నరసాపురం, భీమవరం నుంచి విజయవాడకు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడుతుంది.  
– ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్‌విప్‌  

పనులు ఇలా.. 
ఎన్‌హెచ్‌ 216 బైపాస్‌
రూ. 490 కోట్లు 
కోనసీమ జిల్లా దిండి నుంచి 
మలికిపురం, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి మీదుగా పశ్చిమగోదావరి జిల్లా 
నరసాపురం మండలంలోని రాజుల్లంక నుంచి సీతారాంపురం వరకు 
ఎన్‌హెచ్‌ 165
1,000 కోట్లు 
పాలకొల్లు మండలం 
దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 
40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా జాతీయ రహదారి 
విస్తరణ 

నాలుగు లైన్లుగా విస్తరణ
జాతీయరహదారి 165 పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకు 107 కిలోమీటర్ల మేర ఉంది. దిగమర్రు నుంచి ఆకివీడు వరకు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి రూ.1,000 కోట్లు మంజూరు చేశారు. ఆకివీడు నుంచి పామర్రు వరకు నాలుగు లైన్ల పనులు ఏడాది క్రితమే ప్రారంభమయ్యాయి. ఎన్‌హెచ్‌–165ను దిగమర్రు జంక్షన్‌ నుంచి ఎన్‌హెచ్‌–216కి అనుసంధానం చేస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. తాజాగా విధులైన నిధులతో దిగమర్రు నుంచి ఆకివీడు వరకు పనులు మొదలు కానున్నాయి. ఈ నిర్మాణంతో భీమవరంలో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top