భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే.. | Husband And Wife Die After Attempting Suicide In Bhimadolu Eluru District | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే..

Oct 29 2025 4:03 PM | Updated on Oct 29 2025 5:01 PM

Husband And Wife Die After Attempting Suicide In Bhimadolu Eluru District

సాక్షి, ఏలూరు జిల్లా: సెల్ఫీ వీడియో.. ఆపై సూసైడ్.. భార్యాభర్తలిద్దరూ మృతి.. అనాథైన మూడేళ్ల కుమారుడు.. తొందరపాటుతనమా..? శరీరేచ్ఛలా..? దేనికి సంకేతం.. వెరిసి అనాథగా మారిన బాలుడు..!!. కుటుంబ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్న ఫ్యామిలీస్.. అరచేతిలో మొబైల్ ఫోన్.. అడ్డుకునే వారే లేరు. నా జీవితం.. నా ఇష్టం.. ఒకరిపై ఇష్టం.. మరొకరిపై మోజు.. సంసారం ఒకరితో.. మరొకరితో...!.. వివరాల్లోకి వెళితే..

అవమాన భారంతో జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భీమడోలుకు చెందిన గుండుమోలు భానుపూర్ణిమ (22), భర్త సుధాకర్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా భార్య సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త ఇవాళ(అక్టోబర్‌ 29, బుధవారం) తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చికిత్స పొందుతూ అదే ఆసుపత్రిలో మృతి చెందింది.

ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఇరువురు శనివారం విషo తాగి ఆ సెల్ఫీ వీడియోను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు  పంపించారు. అదే గ్రామానికి చెందిన కటారి మోహన్ అనే వ్యక్తి 15 రోజులు కిందట మాయమాటలు చెప్పి భాను పూర్ణిమను తీసుకెళ్లడంపై... భర్త సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

కొన్ని రోజులు గడిచిన తర్వాత పూర్ణిమ మళ్లీ తిరిగి వచ్చిన క్రమంలో.. మోహన్ అనే వ్యక్తి వారి లైఫ్ లోకి రావడం వల్ల తాము మానసికంగా కృంగిపోతున్నామని సెల్ఫీ వీడియో తీసి పంపిన జంట.. తదనంతరం విషం తాగి సోమవారం రాత్రి భార్య మృతి చెందగా.. ఈరోజు తెల్లవారుజామున భర్త మృతి చెందారు. భాను పూర్ణిమ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి కారకుడైన కటారి మోహన్‌ను అరెస్ట్ చేసిన భీమడోలు పోలీసులు.. రిమాండ్‌కి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement