రఘురామకృష్ణరాజుపై మరో ఫిర్యాదు

A Complaint Filed At NHRC Against MP RaghuRama - Sakshi

రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు

ఫిర్యాదు చేసిన ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌ : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే సీఐడీ కేసు‍లకు సంబంధించి ఆయన బెయిల్‌పై ఉ‍న్నారు. ఇంతలో మరో ఫిర్యాదు ఆయనపై నమోదు అయ్యింది. రెడ్డి సామాజికవర్గాన్ని దూషించారంటూ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది.

హెచ్చార్సీకి ఫిర్యాదు
ఇటీవల రఘురామకృష్ణ రాజు మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా పలు వ్యాఖ్యలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల కమిషన్‌కి ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు మాట్లాడిన వీడియోలను సైతం ఫిర్యాదుతో జత చేశారు. కరుణాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారణకు స్వీకరించింది. దీనిపై త్వరలోనే రఘురామకి ఎన్‌హెచ్చార్సీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. 

బెయిల్‌పై రఘురామ
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఇటీవల రఘురామకృష్ణరాజుపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే విచారణ సందర్భంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రఘురామ బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా మరో సమస్య ఆయన్ని చుట్టుముట్టింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top