
ఢిల్లీ: రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం((NHRC) లేఖ రాసింది. చలి కాలంలో నిరాశ్రయుల కోసం షెల్టర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. వృద్ధులు, పిల్లల కోసం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. చలి గాలులు కారణంగా అనారోగ్యం బారిన పడిన వారికి చికిత్స అందించాలని.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ కోరింది.
2019 నుంచి 2023 మధ్య చలి గాలులతో 3639 మంది చనిపోయారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ గుర్తు చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా చలిగాలి మరణాలు తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యల నివేదికను ఎన్‌హెచ్‌ఆర్‌సీకి పంపాలని ఆదేశాలు జారీ చేసింది.