దసరా ఉత్సవాలు: రోజుకు 10వేల భక్తులు మాత్రమే! | Sakshi
Sakshi News home page

‘ఈ వయసుల వారికి దర్శనానికి అనుమతి లేదు’

Published Mon, Oct 12 2020 4:51 PM

Collector Imtiaz Talks In Press Meet Over Dussehra Utsavalu In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో భాగంగా అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించామని విజయవాడ కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నవరాత్రులలో ప్రతి రోజు 10 వేల మంది ఆన్‌లైన్‌ టికెట్‌ తీసుకున్న భక్తులనే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని స్ఫష్టం చేశారు. మూల నక్షత్రం రోజు 13 వేల మంది భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. 10 సంవత్సరాలు, 60 సంవత్సరాల వయసు పైబడిన వారిని దర్శనానికి అనుమతించబోమన్నారు. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు అమ్మవారి దర్శనం ఉంటుందని, మూలనక్షత్రం రోజు ఉదయం 3 నుంచి రాత్రి 9 గంటలకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. (చదవండి: అలర్ట్‌ : ఈనెల 13 వరకు భారీ వర్షాలు)

దేవస్థానంలోని అన్ని ప్రదేశాల్లో శానిటైజేషన్‌ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో వచ్చే భక్తులు ఎవరికి వారు వాటర్ తెచ్చుకుంటే మంచిదని ఆయన భక్తులకు సూచించారు. కనకదుర్గ నగరం 6 ప్రసాదం కౌంటర్‌లు ఏర్పాటు చేశామని, 450 మంది సిబ్బందిని శానిటైజేషన్‌కు ఉపయోగించినట్లు తెలిపారు. మహమ్మారి దృష్ట్యా నదిలో ఎలాంటి స్నానాలకు అనుమతి లేదని, కేశకండనశాల, అన్నదానం ఉండదు పేర్కొన్నారు. ఈసారి దేవస్థానం తరుపున భవాని మాలవిరమన ఏర్పాట్లు ఉండవని, భవానీలు అయిన సరే ఆన్‌లైన్‌ టికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. రోజుకు ఒక లక్ష లడ్డులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, చెప్పుల స్టాండ్‌ను క్లాక్ రూమ్స్ వీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 93,000 వేల టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే ఇప్పటి వరకూ 65 వేల టికెట్లు బుక్ అయ్యాయని కలెక్టర్‌ వెల్లడించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement